Short and sweet vadinamma today episode in Telugu:: 8/5/2021
Today story:
శైలు ఇంటి నుంచి వెళ్లి పోతుందా?
లక్ష్మణ్ శైలు మీద కోపంతో ఏం చేయనున్నాడు?
సీత తన మాతృత్వాన్ని తిరిగి పొందుతుందా?
రఘురాం తీసుకోబోయే నిర్ణయం ఏంటి?
సీతను రఘురాం తన పుట్టింటికి పంపిస్తాడ?
ఇలా చాలా ప్రశ్నలకి నేటి ఎపిసోడ్ సమాధానంగా నిలుస్తుంది భవిష్యత్తు మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఉంది ఇక కథలోకి వెళ్దాం.
శైలు మొండితనం మరియు సీత చేసిన త్యాగం ఇదే వదినమ్మ ఇంట్లో జరుగుతున్న రచ్చకు కారణాలు.
అయితే సిరి సీత బాబు ని కిందకి తీసుకు వెళ్ళడంతో శైలు ఫ్లవర్ వాజ్ తీసుకొని విసిరేందుకు తెగిస్తుంది. దాంతో అక్కడే ఉన్న భరత్ లక్ష్మణ్ శైలు ని మందలించు ప్రయత్నం చేశారు. ఆ క్రమం లో లక్ష్మణ్ శైలు ని కొట్టే ప్రయత్నం చేస్తాడు. అక్కడే ఉన్న భరత్ లక్ష్మణ్ ని అడ్డుకుంటాడు. లక్ష్మణ్ నీ బలవంతంగా బయటికి లాక్కు వస్తాడు. శైలు కోపంతో తలుపు వేసుకుంటుంది.
భరత్ రఘురాం కి ఫోన్ చేసి ఏం జరిగిందో చెప్తాడు. రఘురాం వెంటనే బయలు దేరుతాడు. ఇంతలో శైలు బట్టలు సర్దుకుని తన పుట్టింటికి వెళ్ళిపోతాను అని కిందకి వస్తుంది.
సీత ఏడుస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ శైలు వినిపించుకోకుండా బాబు ని తీసుకొని వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన రఘురాం దీనంతటికీ కారణం నువ్వే సీత అని అంటాడు. శైలు కి సీత బదులుగా సారీ చెప్తాడు. నా భార్య నీ నేను అదుపులో పెట్టుకుంటాను అని రఘురాం శైలు కి చెప్పాడు. సీత నీ 2 రోజులపాటు తన పుట్టింటికి వెళ్ళమని తీర్పు కూడా ఇస్తాడు.
Review:
సీత అనే మహిళ ఏ స్త్రీ చెయ్యని త్యాగం చేస్తుంది. తన తోటి కోడలు శైలు కోసం తన మాతృత్వాన్ని త్యాగం చేస్తుంది. ఇందులో సీత గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. కానీ శైలు అది ఎప్పటికీ అర్థం చేసుకుంటుంది అనేది ప్రశ్నార్థకం.. ఇలా ఈ క్రమంగా వదినమ్మ సీరియల్ ముందుకు సాగుతుంది.
